- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి త్యాగాలకు దేశం రుణపడి ఉంటుంది: రాంనాథ్ కోవింద్
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి జరిగి సోమవారానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాడుల్లో మరణించిన భద్రతా సిబ్బందిని రాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు నేతలు స్మరించుకున్నారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది అత్యున్నత త్యాగం దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని మోడీ అన్నారు. ‘2001 పార్లమెంటు దాడిలో విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన భద్రతా సిబ్బందికి నేను నివాళులు అర్పిస్తున్నాను. వారి సేవలు, త్యాగాలు దేశానికి ఎప్పుడు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి’ అని ట్వీట్ చేశారు.
]దేశం సిబ్బంది త్యాగాలకు ఎప్పుడు రుణపడి ఉంటుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. 2001 దాడిలో అసువులు బాసిన సిబ్బందికి నేను నివాళులు అర్పిస్తున్నాను. భయంకరమైన ఉగ్రవాద దాడి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన పార్లమెంటును రక్షించారు. దేశం ఎల్లప్పుడూ వారి త్యాగాలకు రుణపడి ఉంటుంది అని ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు నేతలు సిబ్బంది త్యాగాలను స్మరించుకున్నారు.
2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడుల్లో ఎనిమిది మంది సిబ్బంది మరణించారు. వీరితో పాటు సీపీడబ్ల్యూడీ గార్డెనర్ కూడా మరణించారు. కాగా సిబ్బంది ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.ఈ సంఘటన భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతకు దారితీయడమే కాకుండా పార్లమెంటు భద్రతను మరింత పటిష్టం చేసింది.