- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిల్లలు లేకపోతేనేం.. ‘ఆమె’ ఎప్పటికీ పరిపూర్ణమే!
దిశ, ఫీచర్స్ : మాడ్రన్ లైఫ్ స్టైల్, చేంజ్ అవుతున్న ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషన్, సిటీ లైఫ్.. ఇతరత్రా కారణాలతో అర్బన్ ఇండియాలోని ప్రతీ ఆరు జంటల్లో ఒక మహిళ మాతృత్వానికి నోచుకోవడం లేదు. సృష్టికి మూలమైన మాతృత్వం పొందాలని, ‘అమ్మ’ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ వరం లాంటి మాతృత్వం శాపంగా మారి వారిని ఎలా పీడిస్తోంది? పితృస్వామ్య సమాజంలో పిల్లలు లేకపోతే ఆమెను గుర్తించే పరిస్థితులు ఉన్నాయా? తండ్రికి కూతురిగా, భర్తకు భార్యగా, అత్తకు కోడలిగా, ఇంటి పనులు చక్కదిద్దే యజమానిగానే కాకుండా ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ రాణిస్తూ బహుముఖ పాత్రలు పోషిస్తున్నప్పటికీ.. సంతానలేమి ఆమెను మానసికంగా ఎలా కుంగదీస్తోంది? వంటి అంశాలను టచ్ చేస్తూ, పిల్లలు లేకపోతేనేం.. ‘ఆమె’ ఎప్పటికీ పరిపూర్ణమే అన్న కాన్సెప్ట్‌తో వచ్చిన యాడ్ కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెగ్నెన్సీ కిట్ బ్రాండ్ ‘ప్రెగా న్యూస్(Prega News)’ రూపొందించిన ప్రత్యేక యాడ్ ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ కాగా, నెట్టింట వైరల్ అవుతోంది. మహిళ అంటే మాతృత్వానికి మించి అని.. పరిపూర్ణమైన వ్యక్తి(#SheisCompleteinHerself) అని సమాజానికి చాటి చెప్తోంది.
హిందీ నటి మోనా సింగ్ యాడ్‌లో ఓ ఇంటికి పెద్ద కోడలైన లత పాత్ర పోషించారు. ఉపాధ్యాయురాలిగా ఉంటూ తన కుటుంబ వ్యవహారాలన్నీ చక్కదిద్దుతుంటుంది. ఈ క్రమంలోనే తన తోటి కోడలుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఆమెకు పుట్టబోయే బిడ్డకు కుటుంబ సభ్యులు అప్పుడే ఊయల తీసుకురాగా, పిల్లలు లేని లత ఆ బాధను బయటకు కనిపించనీయకుండా ఆనందంగా గడుపుతుంది. ఓ రోజు కుటుంబసభ్యులు పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలని చర్చించుకుంటారు. అబ్బాయి పుడితే ‘ధ్రువ్’ పెట్టాలని ఒకరు సజెస్ట్ చేయగా, అమ్మాయి అయితే ఏం పేరు బాగుంటుందని లతను అడగడంతో.. ఆమె ఉద్వేగానికి లోనై అక్కడ నుంచి వెళ్తుంది. ఇంతలో తోటి కోడలు..‘లతిక’ అని పెడదామని, ఆమె తన అక్క లతకు నీడలా ఉంటుందని, కుటుంబానికి అండగా ఉంటుందని.. ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందని’ అని చెప్పడంతో లత ఆమెను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇండియాలో ఇన్‌ఫెర్టిలిటీ.. మహిళలను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైనా ఈ ఇష్యూస్ గురించి ధైర్యంగా మాట్లాడాలని, సంతానలేమితో బాధపడుతున్న వారికి ధైర్యాన్నివ్వాలనే సందేశంతో పాటు పిల్లలు లేకపోయినా ‘ఆమె’ పరిపూర్ణమని చెప్పేందుకు ప్రెగాన్యూస్ ఈ యాడ్ ద్వారా ప్రయత్నించింది. కాగా ఈ యాడ్‌ను చూసిన వ్యుయర్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. మహిళ గురించి చాలా అందంగా చెప్పారని, సమాజ ధోరణులు మారేందుకు ఈ యాడ్ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ వీడియో చూసి తను నిజంగా ఏడ్చానని, తను ఏడేళ్ల నుంచి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నానని ఓ మహిళ పేర్కొంది.