- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా కారు ఫొటో తీస్తావా..? ట్రాఫిక్ పోలీస్ ను పరుషపదజాలంతో దూషించిన చైర్మన్
దిశ, నర్సంపేట: వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నవంబర్ 1 నుంచి హెల్మెట్ వాడకం, డ్రంకెన్ డ్రైవ్, వాహనాల రిజిస్ట్రేషన్ పై తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా… బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ తో ఓ సొసైటీ చైర్మన్ తీవ్ర వాగ్వాదాని దిగిన ఘటన పట్టణంలోని అంగడి సెంటర్ లో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… గడిచిన వారం రోజులుగా నర్సంపేటలో నిబంధనలు పాటించని వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అంగడి సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నిబంధనలు పాటించకుండా వెళ్తున్న ఓ కారు ఫొటో తీశాడు. ఈ ఘటనతో అసహనానికి గురైన నర్సంపేట పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి కారు దిగి సంబంధిత కానిస్టేబుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సొసైటీ చైర్మన్ పరుషపదజాలంతో దూషించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరలవుతోంది.
- Tags
- insulted