- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘నిరాకరణ ఎందుకో చెప్పండి’
న్యూఢిల్లీ: ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని తరుచూ నిరాకరిస్తున్న సీబీఐకి కేంద్ర సమాచార కమిషన్ కొన్ని సూచనలు చేసింది. కేవలం ఆర్టీఐ చట్టంలోని క్లాజును ఉటంకించి దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్న కారణంతో సమాచారాన్ని నిరాకరించడం సరికాదని తెలిపింది. ఆ సమాచారాన్ని బహిరంగం చేస్తే దర్యాప్తును ఏ విధంగా ప్రభావితం చేసే ప్రమాదమున్నదో వివరించాలని పేర్కొంది. దర్యాప్తునకు ఆటంకం కలిగించే సమాచారాన్ని బహిరంగ పర్చకుండా ప్రభుత్వ సంస్థలకు సెక్షన్ 8(1)(హెచ్) వీలు కలిగిస్తున్నది.
అయితే, సీబీఐ తరుచూ ఈ క్లాజును ఉటంకిస్తూ సమాచారాన్ని వెల్లడించడం లేదని ఓ పిటిషనర్ సీఐసీని ఆశ్రయించాడు. దీంతో ఇన్ఫర్మేషన్ కమిషనర్ వనజ ఎన్ సర్న సమాచార నిరాకరణకు గల సహేతుక కారణాలను తెలియజేయాలని సీబీఐని ఆదేశించారు. కేవలం ఈ క్లాజు అడ్డుపెట్టుకుని సమాచార నిరాకరించడం సరికాదని, ఒకవేళ నిరాకరించాల్సి వస్తే సరైన కారణాన్నీ వెల్లడించాలని భగత్ సింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు రూలింగ్ ఉండటం గమనార్హం.