- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లోకి వెళ్లాలంటే… నన్నుదాటాల్సిందే ?
దిశ, వెబ్ డెస్క్ : పెంపుడు జంతువులంటే ఇంటి యజమానికి చాలా ప్రేమ ఉంటుంది. వాటిని తన కుటుబంలో ఒకరిలా చూసుకుంటారు. ఇక పెంపుడు జంతువులు కూడా సమయం వచ్చినప్పుడు యజమానికి కుటుంబాన్ని కాపాడుతూ తమ విశ్వాసాన్ని చాటుకుంటాయి. తాజాగా ఇలానే ఓపిల్లి తన విశ్వాసాన్ని చాటుకుంది. తనకు అన్నం పెట్టి సాదుకున్న యజమానుల ప్రాణాలు కాపాడింది. పిల్లి ప్రాణాలు కాపాడటం ఏంటీ అనుకుంటున్నారా.. అయితే ఇది చదవాల్సిందే. ఓ తాచుపాము ఇంటిలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆసమయంలో పిల్లి తాచుపామును ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుటుంది. చాలా సేపే ఆ పామును అడ్డుకోవడానికి ఆ పిల్లి ప్రయత్నించింది. దీంతో పిల్లి అరుపులు విన్న ఇంటి యజమానురాలు వచ్చి పామును చూసి దిగ్ర్భాంతి చెందింది. యజమాని కవిత అరుపులతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోవడంతో పాము అక్కడి నుంచి పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే అలా పిల్లి, పామును ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకుని యజమానుల ప్రాణాలు కాపాడింది. అందుకే అంటారు. చేసిన సాయం, అన్నం పెట్టిన చెయ్యిని మనుషులు మర్చిపోయినా జంతువులు మర్చిపోవని.. దానికి నిదర్శనమే ఈ పిల్లి.