- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుల దారుణ హత్య
దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు మరోమారు పడగవిప్పాయి. పాతకక్షలతో ప్రత్యర్థులను మట్టుబెడుతున్నారు. దీంతో రాయలసీమ ప్రాంతాలు నెత్తురోడుతున్నాయి. మెున్న కడప, నిన్న కర్నూలు, నేడు అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా పాత కక్షలు చెలరేగాయి. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్యుతాపురంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వైసీపీకి చెందిన రాజగోపాల్, నారాయణప్పలు భూ వివాదంపై శనివారం తహాశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అచ్యుతాపురం, వేంకటాపురం గ్రామాల మధ్య ప్రత్యర్థులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.
దేవాలయ భూముల ఆక్రమణ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ గొడవ కారణంగానే హత్య జరిగినట్లు సమాచారం. మృతులు ఇద్దరూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులని స్థానికులు చెప్తున్నారు. హత్య జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అచ్యుతాపురం-వేంకటాపురం గ్రామాల మధ్య పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇకపోతే రాయలసీమలో వరుసగా హత్య ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కడప, కర్నూలు, ఇప్పుడు అనంతపురం ఇలా మూడు జిల్లాలలో ఆరుగురు.. ప్రత్యర్థుల చేతిలో బలవ్వడం కలకలం రేపుతోంది.