- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కూతురు కంత్రీ ప్లాన్.. ఉదయం పెళ్లి.. నైట్ మరో యువకుడితో..
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించుకున్నవారందరు పెళ్లి చేసుకోవాలని రూల్ లేదు. కొన్ని ప్రేమలు పెద్దల ఇష్టంతో పెళ్లి వరకు వెళ్తాయి. మరికొన్ని పెళ్లి వరకు రాకుండానే ఆగిపోతాయి. అయితే తల్లిదండ్రుల కోసం ఇష్టంలేని వారిని పెళ్లిచేసుకుంటారు కొంతమంది.. మరికొంతమంది ప్రేమించిన వాడిని దక్కించుకోవడానికి కంత్రి ప్లాన్ లు వేసి కటకటాల పాలవుతారు. తాజాగా ఓ యువతి అలాంటి కంత్రి ప్లాన్ వేసి అడ్డంగా బుక్కయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలియని యువతి తల్లిదండ్రులు ఆమెకు మరో యువకునితో పెళ్లి నిర్ణయించారు. దీంతో యువతి ఓ కంత్రీ ప్లాన్ వేసింది. తల్లిదండ్రులు చూపించిన యువకుడితో తాళికట్టించుకొని, ఆరోజు రాత్రే ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ వేసింది. ప్లాన్ లో భాగంగానే ప్రియుడిని బైక్ తీసుకురమ్మని చెప్పి తన పెళ్ళికి పిలిపించింది. ఆదివారం తలంబ్రాలు కార్యక్రమం జరుగుతుండగా.. ప్రియుడు ఆమెను వెంబడిస్తూ వెళ్లి వారి ఇంటి వెనుక బైక్ పెట్టి ఎదురుచూడసాగాడు.
ఇక ఈ నేపథ్యంలోనే పెళ్లి పీటలు మీద కూర్చున్న యువతి అస్తమానం ఫోన్ నొక్కుతూ ఉండడాన్ని గమనించిన బంధువులు సంగతేంటని ఆరా తీశారు. పెళ్ళిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నా యువతి ప్రియుడిని పట్టుకొని దేహశుద్ది చేయడంతో విషయం బయటపడింది. దీంతో పెళ్లి కొడుకు తరుపు బంధువులు వాగ్వాదానికి దిగారు. ఇక ఈ గొడవతో పెళ్లి వేదిక కాస్త రణరంగంగా మారింది. ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలతో పోలీసులు విచారణ చేశారు. అయితే ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.