వైజయంతి బ్యానర్‌లో ప్రభాస్@21

by Shyam |   ( Updated:2024-06-29 15:51:36.0  )
వైజయంతి బ్యానర్‌లో ప్రభాస్@21
X

వైజయంతీ మూవీస్ సి.అశ్వనీదత్ స్థాపించిన ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ. 1974లో స్థాపించిన వైజయంతీ మూవీస్ బ్యానర్… 46 ఏళ్లలో ఎన్నో క్లాసికల్ హిట్స్‌తో తెలుగు కళామతల్లికి అభిషేకం చేసింది. మరెన్నో తెలుగు ఐకానిక్ మూవీస్ చేసిన ఈ సంస్థ.. కంపెనీ, కలకత్తా మెయిల్ లాంటి బాలీవుడ్ సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. రీసెంట్‌గా మహానటి, మహర్షి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న సంస్థ… ఈ రోజు(మంగళవారం) బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. 50 ఏళ్ల సినీ ప్రస్థానం వైపు అడుగులేస్తున్న వైజయంతీ మూవీస్… ఎపిక్ జర్నీని స్టార్ట్ చేసినట్లు తెలిపింది. బాహుబలి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. ప్రభాస్‌కు ఇది 21వ సినిమా కాగా… మహానటి సినిమాతో ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో పండుగ చేసుకుంటున్నారు అభిమానులు. పర్‌ఫెక్ట్ కాంబినేషన్ అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు ఫ్యాన్స్.

Click Here For Video...


Advertisement

Next Story