‘కొవిడ్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలి’

by Shyam |
‘కొవిడ్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలి’
X

దిశ సిద్దిపేట: కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం జిల్లాలోని కొవిడ్ బాధితులకు అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. ఆదివారం సిద్దిపేట నుండి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా వైద్య అధికారులు, ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా అధికారులతో కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో వెంటిలేషన్ ఆధారిత చికిత్స పొందుతున్న బాధితులకు నిరంతర ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ నిల్వలు పెంచడం, పడకల సంఖ్య పెంచడం, కొవిడ్ కేర్ సెంటర్ (CCC) పనితీరు తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కొవిడ్ బాధితుల ఆరోగ్యం విషమిస్తే వారిని వెంటిలేషన్ అమర్చి చికిత్స అందించాలని సూచించారు. కొవిడ్ బాధితులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ డిమాండ్‌‌ను దృష్టిలో పెట్టుకొని నిల్వల పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్క పేషంట్ ఇబ్బంది పడకూడదన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలతో పాటు సిద్దిపేట సురక్ష ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, డిమాండ్, సరఫరా పై అధికారులు నిత్యం మానిటరింగ్ చేయాలన్నారు. అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నిల్వలను అనవసర ఖర్చు లేకుండా… ఉన్నదాన్ని హేతుబద్ధంగా గరిష్ఠ స్థాయిలో కొవిడ్ బాధితులకు ఉపయోగించుకోనేలా ప్రతి రోజూ సమీక్ష నిర్వహించాలన్నారు.

డిమాండ్ అత్యధికంగా ఉన్న క్లిష్ట సమయంలోనూ జిల్లాలో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు గల కొవిడ్ బాధితులను సిద్దిపేట ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రి సమీపంలోనీ నైట్ షెల్టర్, డా.బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లలో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. బాధితులకు సంతులిత ఆహారం, అవసరమైన మందులు, వైద్య సహాయం అందిస్తూ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పర్యవేక్షణలో బాధితులకు త్వరగా స్వస్థత చేకూర్చేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed