- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sama : గతం మరిస్తే ఎలా ఆర్ఎస్పీ? : సామా

దిశ, వెబ్ డెస్క్ : నాడు ఆత్మగౌరవం అని చెప్పి నేడు బీరు బిర్యానీల బాస్ గడీల ఆదేశాలు పాటిస్తుంది ఎవరంటూ బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar)కు మంత్రి కొండా సురేఖపై చేసిన విమర్శలకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రాంమోహన్ రెడ్డి(Sama Rammohan Reddy) కౌంటర్ వేశారు. రేవ్ పార్టీల బుల్లబ్బాయి మన్ననలు పొందాలని పరితపిస్తుంది ఎవరని, గత పదేండ్లలో ఏనాడూ గురుకులాల పైన శ్రద్ధ చూపని దుర్మార్గ పాలకులని నేడు వెనకేసుకొస్తుంది ఎవరని ఆర్ఎస్పీని ప్రశ్నించారు. బోధన నుంచి భోజనం వరకు మరుగునపడ్డ వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు చేసి, డైట్, కాస్మెటిక్ చార్జీల పెంచి, నాణ్యమైన భోజనం కై టాస్క్ ఫోర్స్, ఇన్స్టిట్యూషన్ కమిటీల ఏర్పాటతో పిల్లలు బాగుండాలని పనిచేస్తున్నారని, అలాంటి మా ప్రభుత్వం పైన మీరు చేస్తున్న దుష్ప్రచారాలు కేవలం స్వార్ధాన్ని ప్రతిబింబిస్తున్నాయని సామా విమర్శించారు.
ఆత్మగౌరవం, నిస్వార్థమే మీ పంథా అయితే.. పేద పిల్లల ఉన్నత భవిష్యత్తే మీ లక్ష్యం అయితే.. ఇన్ని సంవత్సరాలు పిల్లలకి అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీని మీరు వీడి బయటికి వచ్చి పిల్లల పట్ల మీకున్న చిత్తశుద్ధిని చూపాలని...ఆనాటి అందరి ప్రవీణ్ కుమార్ గా మారాలని హితవు పలికారు. తెలంగాణ ఆకాంక్షలైన పటిష్ట విద్యా వ్యవస్థ, పేద పిల్లల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీ సూచనలతో మన తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచడంలో భాగస్వాములవుదామని, పింక్ కుట్ర రాజకీయ నాయకులకు, దుష్ప్రచారాలకి దూరంగా ఉందామని సామా పిలుపునిచ్చారు.