- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశువుల పాక కాదిది.. ప్రాథమిక పాఠశాల..!
దిశ, వికారాబాద్: రాళ్లచిట్టెంపల్లి గ్రామంలోని పాఠశాలను నిర్మించి దాదాపు 10 ఏళ్ళు గడిచిపోయింది. కానీ ఇప్పటికి ఈ పాఠశాల పశువుల దొడ్డిలకే ఉంది. సంబంధిత కాంట్రాక్టర్ కు పూర్తి స్థాయి బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ పనిని మధ్యలోనే వదిలేసి పోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇక గ్రామా సర్పంచ్ మాత్రం నేను సర్పంచ్ గా విధులు మొదలు పెట్టిన రోజు నుండి ఈరోజు వరకు ఎంపిడిఓ, ఎంఈఓ, జిల్లా విద్యాధికారి (డిఈఓ), కలెక్టర్ ఇలా ఎంత మంది దగ్గరకు వెళ్లి అర్జీ పెట్టుకున్నానని తెలిపారు. అయితే ఒక్కరు కూడా మా గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను బాగు చేయడానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలే కరోనా కారణంగా విద్యా వ్యవస్థను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఎంత లేకుంటే ఎంత అనేలా వ్యవహరిస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ పట్టించుకుని మా సమస్యను తీర్చాలని కోరుతున్నారు.
- Tags
- corona