దారుణం : వృద్ధ దంపతులకు నిప్పుపెట్టిన దుండగుడు.. ఇది అతడి పనేనా ?

by Sumithra |   ( Updated:2021-10-09 23:10:17.0  )
దారుణం : వృద్ధ దంపతులకు నిప్పుపెట్టిన దుండగుడు.. ఇది అతడి పనేనా ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులపై శనివారం రాత్రి పెట్రోల్ పోసి దుండగులు నిప్పు అంటించారు. కేపీహెచ్‌బీ కాలనీలోని 6వ ఫేజ్‌లో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. అల్లుడే పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు ఆరోపిస్తున్నారు. వృద్ధ దంపతుల కూతురును సాయికృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా సాయికృష్ణ తమ కూతురిని వేధిస్తున్నాడని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story