- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ లోకి ‘ఫీడ్ ది నీడ్’.. సీఎం బర్తడే కోసం ఎదురు చూపు..
దిశ, ఏపీ బ్యూరో : ఆకలితో అలమటించే వారి కడుపు నింపడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఫీడ్ ది నీడ్’ కార్యక్రమం త్వరలో ఏపీలోనూ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 21న ‘ఫీడ్ ద నీడ్’ను ప్రారంభించనున్నట్లు ఇటీవలే యాపిల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డా.నీలిమా ఆర్య ప్రకటించింది. ఈ ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 21న విశాఖ, తిరుపతిలో రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 350 రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేయనున్నారు.
పళ్లు, బిర్యానీ, కర్రీలు, టిఫిన్స్, రైస్, పాల ఉత్పత్తులు అన్నీ ఈ రిఫ్రిజిరేటర్లలో పెడితే ఆకలితో ఉన్న వాళ్లు వచ్చి వాటిని తీసుకుని తింటారు. అలాగే ఆఫీసుల్లో ఉండే క్యాంటీన్స్, హోటల్స్‌లలో మిగిలిన ఫుడ్‌ను తెచ్చి ఈ రిఫ్రిజిరేటర్లలో పెడితే అవసరమైన వారు తింటారు. ఫలితంగా రాష్ట్రంలో ఆకలి కేకలు అనేవి ఉండవని యాపిల్ ఫౌండేషన్ సంస్థ భావిస్తోంది. ఫీడ్ ది నీడ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభమైంది. అయితే అది అంతగా సత్ఫలితాలు ఇవ్వలేదనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.