- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఎన్నికలకు ప్రభుత్వం రెడీ.. ఏం జరిగినా ఎస్ఈసీదే బాధ్యత’
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పంచాయతీ ఎన్నికలను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది అవుతుందనే ఇన్నాళ్లు ఎన్నికలు వద్దనుకున్నామని తెలిపారు. ఎస్ఈసీ నిర్ణయించినట్టుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ముందుకెళ్లాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని వెల్లడించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే ఆపేసి.. పంచాయతీ ఎన్నికలు తీసుకురావడంలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. అంతేగాకుండా ఎన్నికలపై ఎస్ఈసీ మొండిగా వ్యవహరించిందని, అయినా పంచాయతీ ఎన్నికల్లో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. వాళ్ల ప్రాణాలే తమకు ముఖ్యం అన్నారు. వ్యాక్సినేషన్ ఇప్పటికీ ఇబ్బందిగానే ఉందని అన్నారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే.. గందరగోళ పరిస్థితికి దారితీస్తాయని సుప్రీంకోర్టుకు వివరించామని అన్నారు. బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో ప్రభుత్వానికి తెలుసు అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగితే.. అందుకు ఎస్ఈసీ బాధ్యత వహించాలని సూచించారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టి.. ప్రభుత్వంపై బురదజల్లేందుకు విపక్షాలు, ఎస్ఈసీ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.