వీలైనంత త్వరగా ఆ విచారణ ముగిస్తాం: హైకోర్ట్

by srinivas |   ( Updated:2021-11-15 03:29:17.0  )
వీలైనంత త్వరగా ఆ విచారణ ముగిస్తాం: హైకోర్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: పాలనా వీకేంద్రీకరణ, రాజధాని తరలింపు, CRDA రద్దు పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వరుస కేసుల వల్ల ఏపీ లో అభివృద్ధి ఆగినట్టు కనిపిస్తోందని, రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యత ఉందని, వీలైనంత త్వరగా విచారణ ప్రక్రియ ముగిస్తామని హైకోర్ట్ తెలిపింది.

కక్షిదారులతో సహా అందరూ ఇబ్బంది పడుతున్నారని CJ అభిప్రాయపడ్డారు. మరోవైపు త్రిసభ్య ధర్మాసనం లోని ఇద్దరు న్యాయ మూర్తులపై ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేయగా వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది.

Advertisement

Next Story