- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, కూకట్పల్లి: వస్త్ర దుకాణాల్లో ఎంత రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బట్టల దుకాణాల్లో దృష్టి మళ్లించి చొరీలకు పాల్పడే నలుగురు సభ్యుల ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ సిఐ తెలిపిన వివరాల ప్రకారం శంషీగూడ ఇందిరాగనర్కు చెందిన అచంట నాగమణి తులసినగర్ కాలనీలో మాధవి లేడిస్ఎంపోరియం పేరుతో వస్త్ర దుకాణం నడిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెల 5వ తేదిన రోజు వారి మాదిరిగానే దుకాణం తెరిచిన నాగమణి తన దుకాణంలోని 30 చీరలు తక్కువగా ఉన్నట్టు గుర్తించింది.
దుకాణంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా గత నెల 29వ తేదిన బట్టలు కొనుగోలు చేయడానికి వచ్చిన నలుగురు చీరలను చోరి చేసినట్టు తెలిసింది. దీంతో నాగమణి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి చోరీకి పాల్పడిన వారిని అదుపులో తీసుకున్నారు. అంబర్‌పేట్‌కు చెందిన ఇనుగంటి శ్రీను(36), షేక్ హసీన అలియాస్ కంప లక్ష్మీ(54), నల్గొండ కౌసల్య(60), సిలివేరి సోమయ్య(32)లు గత నెల 29వ తేదిన దృష్టి మళ్లించి చోరీకి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు వారిని అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 20 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు.