- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యులకు పదోన్నతులు కల్పించాలి
దిశ , హైదరాబాద్: వైద్య విధాన పరిషత్ పరిధిలో పని చేస్తున్న వైద్యులకు పదోన్నతులు వెంటనే కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ), మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పుట్లా శ్రీనివాస్, జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్ బృందం సోమవారం మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైద్య విధాన పరిషత్ పరిధిలో దీర్ఘకాలంగా వైద్యుల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వెంటనే అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. డీఎంఈ పరిధిలో వైద్యులకు బకాయిలతో కలిపి పీఆర్సీ ఇవ్వాలని, డిప్యూటీ సీఎస్, సీఎస్ పదోన్నతులతో పాటు అన్ని విభాగాల్లో పని చేస్తున్నవారికి పదోన్నతులు కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలనూ పరిష్కరించాలని కోరినట్లు వెల్లడించారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.