- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెట్ ఇక లైఫ్‌టైమ్ వ్యాలిడిటీ !
దిశ, తెలంగాణ బ్యూరో: టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) సర్టిఫికెట్ ఇక నుంచి జీవిత కాలం చెల్లుతుందని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యూకేషన్ (ఎన్‌సీటీఈ) ప్రకటిచింది. 50వ జనరల్ బాడీ సమావేశంలో పలు అజెండాలపై చర్చించిన ఎన్‌సీటీఈ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఇప్పటివరకూ టెట్ సర్టిఫికెట్ వ్యాల్యూ ఏడేండ్లే కాగా.. ఇక నుంచి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుందని నిర్ణయించింది. ఈ నిర్ణయం భవిష్యత్‌లో పరీక్ష రాసే వారికి వర్తిస్తుండగా.. ఇప్పటికే టెట్ సర్టిఫికెట్ కలిగిన వారి విషయంలో న్యాయ సలహా ప్రకారం నడుచుకోవాలని కౌన్సెల్ భావిస్తోంది. బీఈడీ, ఎంఈడీ ఇంటిగ్రేటేడ్ కోర్సుల నిబంధనలతో పాటు తొమ్మిది రకాల ఎజెండాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఎజెండాకు అనుబంధంగా ఎన్‌సీటీఈ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయడంతో పాటు అంగన్‌వాడీ సిబ్బంది విద్యార్హతలపైనా చర్చించారు. ఈ సమావేశంలో చైర్‌పర్సన్ వినీత్ జోష్, అకాడమిక్ డైరెక్టర్ జోసెఫ్ ఇమాన్యూయేల్, రవీంద్రా మహదేవరావు, భన్వర్‌లాల్ నటియా, సునితా సింగ్, ఉమేష్ చంద్ర వశిష్ట పాల్గొన్నారు.