- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు మేమంటే ఏంటో చూపిస్తాం: ఇంగ్లాండ్ కోచ్
దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు వరుసగా టెస్టు, టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఇక రాబోయే సీజన్‌లో మొదటగా స్వదేశంలో ఇండియాతో, ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడనున్నది. వరల్డ్ కప్ విజయం తర్వాత వరుసగా వెస్టిండీస్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంకపై సిరీస్ విజయాలు సాధిస్తూ వచ్చిన ఇంగ్లాండ్‌ను టీమ్ ఇండియా చావు దెబ్బ తీసింది. ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టుకు యాషెస్ కీలకం కానున్నది. ఆస్ట్రేలియాలో జరుగనున్న ఈ పర్యటనలో రాణించాలంటే ఇండియా పర్యటనను ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ అనంతరం ఇండియా జట్టు ఇంగ్లాండులో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను తాము కీలకంగా భావిస్తున్నట్లు కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తెలిపాడు. మేం తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఇండియాతో సిరీస్‌ను తప్పక ఉపయోగించుకుంటామని ఆయన అన్నారు. యాషెస్‌కు సిద్దపడటానికి ఇండియాతో టెస్టు మ్యాచ్‌లు బాగా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ముగిసిన ఇండియా పర్యటన ద్వారా కూడా జట్టులోని లోపాలు తెలుసుకున్నామని.. వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.