క్యూఆర్‌టీపై ఉగ్రవాదుల కాల్పులు

by Shamantha N |
క్యూఆర్‌టీపై ఉగ్రవాదుల కాల్పులు
X

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్‌టీ)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం పరింపొరా శివారుల్లో చోటుచేసుకుంది. పరింపొరా నగరంలోని జనసమ్మర్థక ప్రాంతం ఖుషిపొరా మీదుగా క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్‌టీ) వ్యానులో వెళ్తుండగా ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లు మృతిచెందారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు పరింపొరాను తమ ఆధీనంలోకి తీసుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేశాయి. జనసమ్మర్థక ప్రాంతం కావడంతో భద్రతా బలగాలు సమయమనం పాటించాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed