- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం.. 12 మంది మృతి
దిశ, వెబ్‌డెస్క్: మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటన లో 12 మంది మృతిచెందగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గురువారం మయన్మార్ రాజధాని నేపిడా నుంచి మిలటరీ విమానం 16 మంది ప్రయాణికులతో పియన్‌వూ ల్విన్‌కు బయలుదేరింది. ఆకాశానికి ఎగిరిన కొద్దీ సమయంలోనే అదుపుతప్పిన విమానం మాండలే నగరంలో స్టీల్ ప్లాంట్ సమీపంలో కుప్పకూలింది. దాదాపు 984 ఫీట్ల ఎత్తు నుంచి విమానం కిందపడినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న 12 మంది మరణించగా.. ప్రమాదం నుండి విమాన పైలట్‌తో పాటు ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. విమానంలో ఉన్నవారంతా సాధువులని, వారంతా ఓ భౌద్ద మఠానికి వెళ్లాల్సి ఉందని.. అంతలోనే ఈ ఘోరం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదానికి కారణం.. వాతావరణం సరిగ్గా లేకపోవడమేనని అధికారులు అనుమానిస్తున్నారు.
A Myanmar military plane has crashed near the central city of Mandalay due to bad weather – casualties fearedhttps://t.co/M2qeMKk8Af pic.twitter.com/XXrEwO4wps
— AFP News Agency (@AFP) June 10, 2021