- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి పదవీకాలం పొడిగింపు
by Shyam |
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర నీటిపారుదలశాఖలో ఎత్తిపోతల పథకాల సలహాదారుగా వ్యవహరిస్తున్న కె. పెంటారెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవీ కాలం పొడిగింపు ఈ నెల 16వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఇందుకు కావల్సిన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను కోరారు. 2018లో పెంటారెడ్డిని మొదటిసారి సలహాదారుగా నియమించినప్పటి నిబంధనలే ఇప్పుడు వర్తిస్తాయని తెలిపారు.
Next Story