పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

by Shamantha N |   ( Updated:2020-06-09 00:28:36.0  )
పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. గుజరాత్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు మంగళవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం సుమారుగా 11 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 60.64 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే.. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పై చేయి సాధించారు. 74.46 శాతం ఉత్తీర్ణతతో సూరత్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా 47.47 శాతం ఉత్తీర్ణతతో ఉదేపూర్ చివరిస్థానంలో నిలిచింది. 281 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయని బోర్డు పేర్కొన్నది.

Advertisement

Next Story