- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిచ్‌కుందలో ఉద్రిక్తత
X
దిశ,వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని బిచ్‌కుందలో ఓ యువకుడిని ఇసుక లారీ ఢీ కొట్టింది. ఆ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు ఇసుక లారీకి నిప్పంటించారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానికులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు శాంతించక పోగా పోలీసులపైనే దాడి చేశారు. అటుగా వెళుతున్న మరో మూడు లారీల అద్దాలను ధ్వంసం చేశారు. కాగా గాయపడిన వ్యక్తిని గోపన్‌పల్లికి చెందిన విజయ్(28)గా గుర్తించారు. అతన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Advertisement
Next Story