- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భయం నీడన భైంసా.. బయటకు రావాలంటే టెన్షన్
దిశ, ప్రతినిధి ఆదిలాబాద్ : ఆదివారం రోజు జరిగిన ఇరు వర్గాల ఘర్షణతో భైంసాలో పోలీసులు భారీ బందోబస్తుతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రజలు ఇంకా భయం నీడలోనే ఉన్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. భైంసాలో 144సెక్షన్ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణువారియర్ రామగుండం కమీషనరేట్ సీపీ సత్యనారాయణ భైంసాలోనే మకాంవేయగా.. జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
భైంసా పట్టణంలోని అన్ని వీధుల్లో భారీ బందోబస్తుతో.. చెక్‌పోస్టులను పికెటింగ్లను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల నుంచి వచ్చే వాహనాలను పట్టణంలోకి అనుమతించడం లేదు. నిజామాబాద్, నిర్మల్‌తో పాటు పరిసర మండలాల నుంచి వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేసి ప్రతి వాహనాన్ని చెక్ చేసి పంపిస్తున్నారు. పట్టణంలోనికి వాహనాలను అనుమతించడం లేదు. భైంసాలో అన్ని దుకాణాలను మూసివేయగా.. నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతిస్తున్నారు.
బీజేపీ నాయకులు భైంసాలోని బాధితులను పరామర్శించేందుకు పట్టణంలోని పరిస్థితిని తెలుసుకునేందుకు బయలుదేరగా వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీలను అరెస్టు చేయగా మిగతా బీజేపీ నాయకులను కూడా అడ్డుకుంటున్నారు. భైంసాకు వెళ్లే అన్ని రహదారులపై పోలీసుల పటిష్ట నిఘా కొనసాగుతోంది. భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖి, ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు.