తెలంగాణ అసెంబ్లీ ఎదుట టెన్షన్.. టెన్షన్

by Anukaran |
Telangana Assembly
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాలు, పార్టీల నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.

ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీకి తరలివెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని, అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేసి ఎస్సీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు ఐక్య వేదిక నాయకులను, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed