- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడపలో ఠాగూర్ హాస్పిటల్ సీన్
దిశ, వెబ్ డెస్క్: కడప చెన్నై ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ నాలుగు రోజుల చిన్నారి చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. బాబు నిన్నే చనిపోతే చెప్పకుండా దాచారని ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా రవీంద్ర నగర్ కు చెందిన అన్సర్, షబానా దంపతులకు చెందిన 4 రోజుల చిన్నారికి ఊపిరి ఆడకపోవడంతో కడప చెన్నై చిల్డ్రన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 రోజుల క్రితం చెన్నై చిల్డ్రన్ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందాడు.
రెండు రోజుల క్రితం చిన్నారి మృతి చెందినా సీరియస్ గా ఉందని రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో.. వారు బాబును రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాబును పరిశీలించిన డాక్టర్లు బాబు రెండు రోజుల క్రితమే చనిపోయాడని నిర్ధారించారు.
దీంతో చెన్నై ఆసుపత్రి నిర్లక్ష్యంతో వైద్యం వికటించి బాబు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు.పరిస్థితిని అదుపు చేసేందుకు ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు వెనక్కి వెళ్లిపోవాలంటూ చిన్నారి బంధువులు నినాదాలు చేస్తున్నారు. చిన్నారి మృతికి కారణమైన డాక్టర్ ని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.