- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు: వైఎస్ షర్మిల
దిశ, తిరుమలాయపాలెం: కేసీఆర్ ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 46వ రోజు.. తిరుమలాయపాలెం మండలంలో రెండవ రోజు కొనసాగిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ పాదయాత్ర మంగళవారం బచ్చోడు నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర బందపల్లి గ్రామంలో ముగిసింది. మధ్యాహ్న సమయానికి బీరోలు గ్రామం చేరుకున్న పాదయాత్రలో భాగంగా ప్రతీ మంగళవారం నిర్వహించే నిరుద్యోగుల నిరాహారదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడం ఖాయమని పేర్కొన్నారు.
మహానేత వైఎస్ఆర్ ప్రారంభించిన పాదయాత్ర కొనసాగింపుగానే ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టి, ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అప్పుల బాధతో రైతులు, ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారన్నారు. వేల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కొలువులు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గడిపల్లి కవిత, లక్కినేని శ్రీధర్, రాజగోపాల్, నీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.