- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గన్‌తో యువకుల హల్చల్.. ప్రశ్నించిన స్థానికులపై తుపాకీ గురి
దిశ ప్రతినిధి, సంగారెడ్డి/అమీన్పూర్: ఇద్దరు యువకులు. స్కూటీపై వచ్చారు. వీడియోలు తీస్తూ హల్చల్చేశారు. మీరెవరని ప్రశ్నించిన స్థానికులపైకి తుపాకి గురి పెట్టారు. చంపేస్తామని బెదిరించారు. ఈ పరిణామంతో గ్రామస్తులు వణికిపోయారు. ధైర్యం తెచ్చుకున్న కొందరు యువకులు ఇద్దరిని పట్టుకున్నారు. తుపాకీని లాక్కుని చితకబాదారు. ఎక్కడి నుంచి వచ్చారు..? ఇక్కడ ఏం చేస్తున్నారు..? ఎవరు మీరు..? అని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్మండలం ఐలాపూర్ వద్ద ఉదయం ఈ ఘటన కలకలం సృష్టించింది. ఇద్దరినీ చితకబాదిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. వీరెవరు..? ఎందుకు వచ్చారు..? తుపాకులతో ఇక్కడ ఎందుకు సంచరిస్తున్నారు..? ఏం వీడియోలు తీస్తున్నారు..? అని పోలీసులు విచారణ చేపట్టారు.