- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని సెక్యూరిటీలో తెలంగాణ యువకుడు
దిశ, నవీపేట్: ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని తో సహా అత్యున్నత పదవిలో ఉన్న వారికి రక్షణ కోసం ఏర్పరచిన రక్షణ దళం, దేశంలో సుమారు 3వేల మంది మెరికల్లాంటి అధికారులు ఈ దళం లో పనిచేస్తున్నారు. మండలంలోని నందిగామకు చెందిన చెట్టుకింది కమలాకర్ రావు గత ఆరేళ్లుగా ఎస్పీజీ సెక్యూరిటీ అధికారిగా ఢిల్లీలో పనిచేస్తూ.. ప్రధాని సెక్యురిటీలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. ఎస్పీజీ లో తమ గ్రామ యువ అధికారి ఆరేళ్లుగా పని చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ అత్యున్నత రక్షణ దళంలో పని చేస్తున్న కమలాకర్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. తండ్రి నాగారావు వ్యవసాయం చేస్తూ తన ముగ్గురు పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.
ముగ్గురు రక్షణ రంగంలో..
పెద్దన్న ముత్యం రాజు పోలీస్ డిపార్ట్మెంట్ లో జిల్లాలోని మోర్తాడ్‌లో సబ్ ఇన్స్పెక్టర్ పని చేస్తుండగా.. చిన్న అన్న తేజస్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి యువకులకు శిక్షణ ఇచ్చి దేశ రక్షణ రంగానికి పంపిస్తున్నారు. ఇలా ముగ్గురు అన్నదమ్ములు దేశానికి సేవ చేయడం పై గ్రామ ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. దేశ ప్రధానికి సెక్యూరిటీ కల్పించే మెరికల్లాంటి అధికారులతో కమలాకర్ ఉండడంతో స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆ కుటుంబమే యువతకు ఆదర్శం.. : సంజీవ్, గ్రామస్తుడు
రైతు కుటుంబంలో జన్మించారు. రేయింబవళ్ళు కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉన్నత హోదాల్లో ఉన్నారు. ముఖ్యంగా సీహెచ్ కమలాకర్ రావు అసాధారణ ప్రతిభతో ఆరేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ గారి వద్ద ఎస్పీజీ లో పనిచేస్తుండటం గొప్ప విషయం. ఆరు అడుగుల రెండు అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయమైన రూపం ఉండటంతో "క్యా కమల్" అని ప్రధాని పలకరించిన అనుభూతిని మరచిపోలేనని ఓ సందర్భంలో చెప్పారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మా గ్రామ యువత బాగా కష్టపడి చదవాలి, ఉద్యోగాలు సంపాదించి ఉన్నత హోదాల్లోకి వెళ్లాలి.
గ్రామం హర్షిస్తుంది..: సాయినాథ్, ఉప సర్పంచ్
నా క్లాస్మేట్ కమలాకర్ రావు చిన్నప్పటి నుంచి ఆటలు, చదువుల్లో రాణిస్తుండేవాడు. కష్టపడి చదివేవాడు. ఊరికి ఢిల్లీలో మంచి పేరు తెచ్చాడు. ఆరేళ్లుగా ప్రధాని మోడీ సేవలో ఎస్పీజీ లో పనిచేయడం గొప్ప విషయం. కమలాకర్ సేవలకు గ్రామం హర్షిస్తుంది.