Bigg Boss 8: కిర్రాక్ సీత బిగ్ బాస్ లో ఎంత సంపాదించిందో తెలిస్తే షాకవ్వాల్సిందే

by Prasanna |   ( Updated:2024-10-15 14:24:03.0  )
Bigg Boss 8: కిర్రాక్ సీత బిగ్ బాస్ లో ఎంత సంపాదించిందో తెలిస్తే షాకవ్వాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్‏బాస్ సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ సీజన్ లో అన్ని మనం ఊహించని విధంగానే ఉన్నాయి. అయితే ఆరో వారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయింది. ఎందుకంటే, ఈ వారం అందరి కంటే తక్కువ ఓటింగ్ సీతకు రావడంతో ఆమె ఎలిమినేట్ అయింది.

అయితే, మొదట్లో బాగానే ఆడింది కానీ, బిగ్ బాస్ నుంచి ఎవరు ఊహించని విధంగా బయటకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కిర్రాక్ సీత రెమ్యునరేషన్ గురించి నెట్టింట ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సీత.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన బేబీ మూవీలో చిన్న పాత్ర చేసింది. ఈ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అదే ఫాలోయింగ్ తో బిగ్ బాస్ కు వెళ్లే అవకాశం కూడా వచ్చింది. వారానికి రూ. 2 లక్షల చొప్పున అంటే ఆరు వారాలకు గానూ దాదాపు 12 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలిసిన సమాచారం.

Advertisement

Next Story

Most Viewed