నిటారుగా కూర్చునే భోజనం చేయాలా? ఎందుకు?

by S Gopi |
నిటారుగా కూర్చునే భోజనం చేయాలా? ఎందుకు?
X

దిశ, ఫీచర్స్ : సోఫాలో రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నప్పుడు అమ్మ ప్లేట్‌లో భోజనం అందిస్తే.. లేజీనెస్‌ కారణంగా అదే పొజిషన్‌లో ఉండి తినేస్తుంటాం. కానీ అలా తింటే ఆహారాన్ని అవమానించినట్లేనని, సరిగ్గా కూర్చుని తినమని అరుస్తుంది అమ్మ. ఈ విషయాన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా బలపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమలో కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుందని సూచిస్తున్నారు.

జీర్ణక్రియకు ఎలా కూర్చుంటే మంచిది?

ఏదైనా సౌకర్యవంతమైన ఉపరితలం, కుర్చీ లేదా సుఖాసనం(క్రాస్-లెగ్డ్)లో నిటారుగా కూర్చోవచ్చు. అయితే దేనిపై కూర్చున్నామన్నది కాకుండా నిటారుగా కూర్చోవడమే పాయింట్. ఒకవేళ డైనింగ్ టేబుల్‌పై కూర్చున్నట్లయితే.. తినేటప్పుడు ముందుకు వంగే అవసరం లేకుండా కుర్చీని టేబుల్‌కి దగ్గరగా వేసుకోవాలి. నేలపై లేదా మంచం మీద కూర్చుంటే వంగకుండా ఉండేందుకు ప్లేట్‌ను పైకి లేపాలి.

నిటారుగా కూర్చోవడం జీర్ణక్రియకు ఎలా సాయపడుతుంది?

జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలనుకుంటే.. పెరిస్టాల్సిస్ అనే ప్రక్రియ సరిగ్గా నిర్వహించేందుకు సాయంచేయాలి. ఆహారాన్ని జీర్ణవ్యవస్థ అంతటా ప్రయాణించేలా చేసే ఈ ప్రక్రియ.. సమన్వయ కదలికల శ్రేణిలో కడుపు, ప్రేగు గోడలు కాంటాక్ట్ అయినప్పుడు జరుగుతుంది. పోషకాలన్నింటినీ సమర్థవంతంగా పంపిణీచేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.

వంగి కూర్చుంటే ఏం జరుగుతుంది?

వంగి కూర్చోవడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల పెరిస్టాల్సిస్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా జీర్ణవ్యవస్థలోని ఆహారం సంకుచితమవుతుంది. జీర్ణశక్తి తగ్గి, బలం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే శరీరం ఆహారాన్ని ప్రాసెస్ చేయడానికి, పోషకాలను గ్రహించడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఇది గ్యాస్ ఉత్పత్తి, బాధాకరమైన మలబద్ధకం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

Advertisement

Next Story

Most Viewed