- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీరియడ్ టైమ్‌లో ఆ సమస్యలు ఎదుర్కొటున్నారా.. ఇలా చెక్ పెట్టండి
దిశ, ఫీచర్స్ : ఋతుస్రావం ఒక సహజమైన ప్రక్రియ. అయితే దీనిపై శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. మెన్‌స్ట్రువేషన్స సమయంలో స్త్రీ శారీరక శ్రమలో పాల్గొనకూడదనేది ఇందులో ఒకటి కాగా.. ఈ అసంబద్ధమైన నమ్మకం స్త్రీలు విశ్రాంతి తీసుకోవాలని, భరించలేని నొప్పిని మౌనంగా అనుభవించాలని డిమాండ్ చేస్తోంది. కానీ ఈ టైమ్‌లో వ్యాయామం చేయడం ద్వారా రుతు నొప్పి, తిమ్మిర్లు, మూడ్ స్వింగ్స్, వికారం లాంటి లక్షణాలు తగ్గించవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడింది. అన్ని వయసులకు చెందిన మహిళలు శారీరక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని.. ఆరోగ్యకరమైన బరువుతోపాటు బలం పెంపొందించుకోవచ్చని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
తేలికపాటి వ్యాయామం:
ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) మరియు ప్రైమరీ డిస్మెనోరియా (ఋతు తిమ్మిరి లేదా పీరియడ్స్ నొప్పి) అనేవి రెండు సాధారణ రుతుక్రమ రుగ్మతలు. ఇవి రెండూ పీరియడ్స్ సమయంలో స్త్రీల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పీరియడ్ టైమ్‌లో మొదటి కొన్ని రోజులు బాధాకరంగా ఉంటాయి. ఈ రోజుల్లో స్త్రీలలో అధిక రక్తస్రావం ఉంటుంది. అలాంటప్పుడు సున్నితమైన కదలికలు, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే వాకింగ్ అండ్ రన్నింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలలో పాల్గొనే మహిళలు తక్కువ PMS లక్షణాలు అనుభవిస్తారని ఓ అధ్యయనం చెప్తుంది. ఋతుస్రావం సమయంలో వ్యాయామం మానసిక స్థితిని మెరుగుపరిచి, రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే వ్యాయాయం ద్వారా ఋతుస్రావంతో సంబంధం ఉన్న తిమ్మిరి, తలనొప్పి, వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
యోగా మరియు పైలేట్స్:
యోగా ఒక ఔషధంలా పనిచేస్తుంది. శరీరాన్ని శాంతపరచడం ద్వారా తిమ్మిరి, రొమ్ము సున్నితత్వం, కండరాల అలసట, పుండ్లు వంటి లక్షణాల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మరింత సున్నితమైన వ్యాయామం 'పైలేట్స్' శరీరాన్ని బలపరుస్తుంది. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు ఆదర్శవంతమైన వ్యాయామంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడం, మెదడు రసాయనాలను సమతుల్యం చేయడంలో ఏరోబిక్ వ్యాయామం కంటే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ యొక్క శారీరక, మానసిక లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది.
స్ట్రెంత్ ట్రైనింగ్:
ఋతుస్రావం సమయంలో పనిచేయకుండా ఉండాలని సూచించే శాస్త్రీయ ఆధారాలు లేవు. స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది పీరియడ్ డేట్ గడువు ముగిసే సమయానికి ఒక అద్భుతమైన కార్యాచరణ రూపం. ఫోలిక్యులర్ దశలో శక్తి శిక్షణ ఎముకలు, కండరాలు, కనెక్టివ్ టిష్యూస్ బలాన్ని పెంచడంలో సహాయపడుతుందని పరిశోధన నిరూపించింది.
ప్రతి స్త్రీ శరీరం విభిన్నంగా, ఉత్తమంగా పనిచేస్తుంది. శారీరక వ్యాయామం అనేది ప్రతీ ఒక్కరికి హెల్ప్ అవుతుంది. కానీ పీరియడ్‌లో చేసే వర్కవుట్‌లు శరీరంపై అదనపు భారాన్ని మోపకూడదు, నొప్పిని కలిగించకూడదు, పీరియడ్స్ సైకిల్‌కు అంతరాయం కలిగించకూడదు. ఇంటి లోపల లేదా వెలుపల ఏదైనా పని చేస్తున్నప్పుడు, ప్యాడ్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులు, టాంపాన్‌లను ఉపయోగించాలి. ఋతు పరిశుభ్రతను పాటించాలి.