- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీహార్ సీఎం, స్పీకర్ మధ్య వార్: అసెంబ్లీ సాక్షిగా నితీశ్ కుమార్ ఆగ్రహం
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాల మధ్య అసెంబ్లీ సమావేశాల్లోఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీకర్ ప్రశ్నలు లేవనెత్తడంతో సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా బీజేపీపై నితీష్ కుమార్ అసహనం కలిగి ఉన్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. కాగా గత నెలలో స్పీకర్ నియోజకవర్గంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కొందరు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిలో స్పీకర్ కలగజేసుకోవడంతో పోలీసులు ఆయన తప్పుగా ప్రవర్తించారని తెలిపారు. అయితే ఈ అంశంలో సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో స్పీకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఎవ్వరికీ అండగా ఉండబోదని నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. కాగా గత కొన్ని రోజులుగా బీజేపీకి నితీష్ కుమార్‌కు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. దీంతో మరోసారి ఈ విషయం స్పష్టమైంది.