అఖిలేష్ అల్లర్లను ప్రచారం చేస్తున్నారు: ఎస్పీ చీఫ్‌పై నిప్పులు చెరిగిన యోగీ

by Disha Desk |
అఖిలేష్ అల్లర్లను ప్రచారం చేస్తున్నారు: ఎస్పీ చీఫ్‌పై నిప్పులు చెరిగిన యోగీ
X

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై విమర్శలకు దిగారు. యూపీలో అఖిలేష్ అల్లర్లకు ప్రచారం కల్పిస్తున్నారని విమర్శించారు. బారాబంకి ఎన్నికల ర్యాలీలో గురువారం ఆయన ప్రసంగించారు. ప్రజలకు ఏ ప్రభుత్వం కావాలో ఎంచుకోవాలని కోరారు. 'మీకు ఏ ప్రభుత్వం కావాలి? రాష్ట్రాన్ని అల్లర్లలోకి తీసుకెళ్లేవారా? పేద ప్రజల సంక్షేమం కోరే వారా?' అని అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే బాలికలకు స్కూటీలతో పాటు, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ తమ హయాంలో బారాబంకి ప్రజలపై వివక్ష చూపిందని ఆరోపించారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం సమానంగా విద్యుత్ సరఫరా చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం మాఫియాల నుంచి డబ్బు రాబట్టి సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తుందని చెప్పారు. అంతేకాకుండా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ.. పథకాలకు అందించే నగదును పెంచనున్నట్లు చెప్పారు. తమ హయాంలోనే రాష్ట్రంలో వైద్య కళాశాలలు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed