- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yoga: మధుమేహాన్ని అదుపుచేసే ప్రాణాయామం.. ప్రయోజనాలు..
దిశ, ఫీచర్స్: కపాలభాతి ప్రాణాయామం: ఈ ఆసనం ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకుని ఖాళీ కడుపుతో చేయాలి. ముందుగా సుఖాసనంలో గానీ పద్మాసనంలో గానీ కూర్చోవాలి. కళ్ళు పూర్తిగా మూసుకోవాలి. చేతులు ధ్యాన ముద్రలో ఉంచాలి. బొటన వేలు, చూపుడు వేలు కలిసి ఉండాలి. మిగిలిన వేళ్లు నిటారుగా ఉండాలి. కొద్ది సమయం సాధారణ శ్వాస తీసుకోవాలి. మనసులో ఆలోచనలన్నీ కుదుటపడ్డాక ప్రక్రియ మొదలు పెట్టాలి. గాలి పీల్చుకొని, గాలి వదిలే సమయంలో పొట్టను ఒక జెర్క్‌తో లోపలికి లాగాలి. ముందుగా 20, 30 సార్లు చేయడం మొదలు పెట్టి నెమ్మదిగా 100 నుంచి 200 వరకు చేయాలి. ఈ ప్రక్రియలో గాలి వదిలేటప్పుడు మన శరీరంలోని మలినాలన్నీ బయటకు పోతున్నట్లుగా ఊహించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. గాలి వదిలేటప్పుడు ముఖంలో ఏ విధమైన ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడాలి.
ఉపయోగాలు :
* మధుమేహాన్ని అదుపుచేస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది.
* రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
* నిద్ర బాగా పడుతుంది.
* ముఖం కాంతివంతమవుతుంది.