- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yadadri: యాదాద్రిని దర్శించుకున్న శ్రీ శారదా పీఠాధిపతి..
దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాన ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత మొట్టమొదటి సరిగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కరోనా కారణంగా విశాఖ ఋషికేశిలోనే గడిపానని తెలిపారు.
ఈ ఆలయంలో కృష్ణ శిలలా కట్టడం మహాద్భుతం అని అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలులా.. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారని, దేశంలోనే ఎంతో మంది హిందువులు ఉన్నా.. ఎవ్వరూ చేయని నిర్మాణం ఆయన చేశారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇది ఆధ్యాత్మిక స్వర్గదమని, ఇంకా కొన్ని సదుపాయాలు లోటుచేసుకుందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అభివృద్ధి చెందింది.. కానీ సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలని అన్నారు.
గతంలో ఆగమన శాస్త్రం ప్రకారం చిన్నజీయర్ స్వామి పెట్టిన ముహూర్తానికి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ జరిపించారని మీడియా వారు ప్రశ్నించగా హిందూ దేవాలయాలు ఎవరి సొత్తు కాదని, ప్రజాలందరివి అన్నారు. యుగ యుగాలుగా శైవులు, వైష్ణవులు వైశ్యమ్యాలతో కొట్టుకున్నారు. ఆది శంకరాచార్యుల వారు అందరినీ సమానంగా చూశారని తెలిపారు. అన్ని దేవతలా నిలయం యాదాద్రి అని తెలియజేశారు.
హైందవ మత సంప్రదాయములో పరమశివుని ప్రధాన అధిదేవతగా ఆరాధించే శాఖను శైవము(Shaivism) అంటారు. వీరు శివాలయాలలోని లింగాకారంలో నున్న శివుని పూజిస్తారు. శివారాధకులకు శైవులు అని అంటారు. శైవ మతాన్ని ప్రచారం చేయడానికి సాహిత్యాన్ని సృష్టించిన వారు శివకవులు. వారిలో నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు ముఖ్యులు. వీరిని "శివ కవిత్రయం" అని అంటారని తెలిపారు.
ఎండలో మీడియా సమావేశం పట్ల స్వరూప నందేంద్రస్వామి ఆగ్రహం
ప్రెస్ కు ఇచ్చే మర్యాద ఇది కాదు. ఇక్కడ ఎండలో ఇలా నిలబెట్టి అతిథులతో మీడియాను మాట్లాడించే పరిస్థితి మారాలి.యాదాద్రి క్షేత్ర వైభవం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో మీడియాకు గౌరవం ఉండాలి మీడియా యొక్క సహకారం తీసుకోవాలి యాదాద్రి దేవస్థానం అధికారులు ఈ విషయంలో చొరవ చూపాలని విశాఖ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు అన్నారు. మంగళవారం ఆలయ ఘటన తర్వాత మొట్ట మొదటి పీఠాధిపతి హోదాలో ఆయన మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామీజీ కొండకింద శ్రీ లక్ష్మీ నరసింహ సధనం మెట్ల వద్ద ఒక టేబుల్ ఏర్పాటు చేసి మీడియా సమావేశం జరిపారు. సమావేశం ముగిసిన మీదట ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్ స్వామీజీకి యాదాద్రి జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టికి తీసుకుపోయారు.
మీడియాను కొండపైకి అనుమతించడం లేదని ఇలా కొండ కింద ఎండలో నిలబడి మీలాంటి వారి ఇంటర్వ్యూలు చేయాల్సి వస్తోందని చెప్పగా ఆయన తీవ్రంగా స్పందించారు. ఇంతటి ఎండలో ఇలాగ నిలబడి సమావేశం పెట్టడం బాధగా ఉంది. ఇంతటి దారుణ పరిస్థితి ఉంటుందని అనుకోలేదు. మీడియాకు మంచి గౌరవం ఇవ్వాలి మీడియా వల్లనే ప్రచారం జరుగుతుంది. గదుల విచారణ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సరైంది కాదు. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్వామిజీ తెలియజేసారు. యాదాద్రి అభివృద్ధిని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని అదే స్థాయిలో ప్రచారం కూడా అవసరమని చెప్పారు. మీడియా ఉంటేనే ప్రచారం జరుగుతుందని అన్నారు. దేవస్థానం అధికారులు, కమిటీ వారు ఇది ఆలోచించాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఎండలో నిలబడి ప్రెస్ మీట్ కు హాజరైన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేశారు.