- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెలిప్యాడ్ కలిగిన కారు.. 36 ఏళ్ల తర్వాత మళ్లీ రికార్డు..!
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా ప్రసిద్ధి పొందిన 'ది అమెరికన్ డ్రీమ్' మళ్లీ 36 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించబడింది. పూర్తిగా మరమ్మతులు చేయబడిన ఈ కారు.. గతంలో తాను క్రియేట్ చేసిన ప్రపంచ రికార్డును అదే బద్దలు కొట్టింది. మార్చి1, 2022న ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా అవతరించింది. కారులో ఎంతమంది కూర్చుంటారు మహా అంటే ఓ పది మంది అనుకుందాం. మరి అందులో ఏం సౌకర్యాలుంటాయి? మనం కస్టమైజ్ చేసుకుంటే.. వాష్ బేసిన్, బాత్‌రూమ్, కిచెన్, ఓ బెడ్ అరెంజ్ చేసుకోవచ్చు. కానీ 'ది అమెరికన్ డ్రీమ్' కారులో 75 మంది కంటే ఎక్కువ మంది కూర్చునే సౌలభ్యంతో పాటు అందులో స్విమ్మింగ్ పూల్, డైవింగ్ బోర్డ్, బాత్ టబ్, మినీ-గోల్ఫ్ కోర్స్, టీవీలతో పాటు ఐదు వేల పౌండ్ల బరువును కలిగి ఉండే హెలిప్యాడ్ కూడా ఉండటం విశేషం. సాధారణంగా కారు 10 నుంచి 16 అడుగుల పొడవుంటే.. ఓడ లాంటి ఈ కారు 100 అడుగుల పొడవు కలిగి, రోడ్డుపై పార్కింగ్ లేదా డ్రైవ్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది.
'ది అమెరికన్ డ్రీమ్'ను ప్రముఖ కార్ బిల్డర్ 'జే ఓర్‌బర్గ్' 1986లో మొదటిసారిగా నిర్మించగా, కాడిలాక్ ఎల్డోరాడో లిమోస్ సిరీస్‌లో దీన్ని విడుదల చేశారు. ముందు, వెనక V8 ఇంజిన్స్ కలిగిన ఈ కారు.. 26 చక్రాలతో 60 అడుగుల పొడవుండేది. ఆ తర్వాత మరింత పొడవు పెంచి కొద్ది కాలం పాటు వినియోగించారు. అయితే కొన్ని సినిమాల్లో వినియోగించిన ఈ కారును చాలా ఏళ్లుగా న్యూజెర్సీ గిడ్డంగి వెనుక భాగంలో ఉంచడంతో పూర్తిగా తుప్పు పట్టిపోయింది. దీంతో 2019లో దీన్ని రీస్టోర్ చేసే ఉద్దేశంతో ఫ్లోరిడాలో డెజర్లాండ్ పార్క్ కారు మ్యూజియం యజమాని మైఖేల్ డెజర్ దీన్ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం మూడేళ్ల పాటు కష్టపడిన ఆయన.. దాదాపు రూ. 19 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఈ మేరకు క్యాబిన్ మొత్తాన్ని మరో కారు క్యాబిన్‌తో భర్తీ చేసి, కారు మొత్తాన్ని కొత్తదానిలా తయారుచేశాడు. ఈ ప్రక్రియలో అతను దాని పొడవుకు ఒకటిన్నర అంగుళాన్ని జోడించేలా చూసుకున్నాడు. దీంతో దాని గత గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను మరోసారి బ్రేక్ చేయగలిగింది. అయితే ఈ కారును రోడ్డుపైకి తీసుకెళ్లే ఆలోచన డెజర్‌కు లేకపోగా, అది అతడి మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.