యుద్ధం కారణంగా రికార్డు స్థాయికి ప్రపంచ ఆహార ధరలు: ఐరాస

by Harish |
యుద్ధం కారణంగా రికార్డు స్థాయికి ప్రపంచ ఆహార ధరలు: ఐరాస
X

జెనీవా: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలపై పడింది. అంతర్జాతీయంగా నిత్యావసరాలు, వంట నూనెల ధరలు తీవ్రంగా పెరగడానికి కారణమయ్యాయని శుక్రవారం ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతున్న దాడులతో ఉక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా నిలిచిపోయాయని తెలిపింది. మరోవైపు రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించడం కూడా దీనిని మరింత తీవ్రం చేశాయని పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ లో సాగుచేస్తున్న ధాన్యం, గోధుమలు, మొక్కజొన్న, కూరగాయలు పెద్ద ఎత్తున ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొంది. ప్రపంచ ఆహార నిత్యావసర ధరలు మార్చి నుంచి గరిష్టానికి పెరిగాయి. నల్ల సముద్రంలో ప్రభావం ఉండడంతో రవాణాపై ప్రభావం పడి ధరలు షాక్ చేస్తున్నాయని సంస్థ ప్రకటనలో పేర్కొంది. ఆహార ధరల సూచిక ఫిబ్రవరిలో గరిష్టం కాగా, మార్చి 12.6శాతానికి చేరినట్లు పేర్కొంది. కాగా గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ దేశాలు వరుసగా 30, 20 శాతం గోధుమ, మొక్కజొన్న ఎగుమతులు చేస్తున్నాయని తెలిపింది.

Advertisement

Next Story