మహిళల కోసం ఆర్టీసీ బంపర్ ఆఫర్.. సజ్జనార్ కీలక నిర్ణయం!

by GSrikanth |
మహిళల కోసం ఆర్టీసీ బంపర్ ఆఫర్.. సజ్జనార్ కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎస్ ఆర్టీసీ సరికొత్త స్కీమ్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రజారవాణాలో ప్రయాణించే సమయంలో మహిళల రక్షణ కోసం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే పిల్లల దినోత్సవం రోజు పిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించిన ఆర్టీసీ తాజాగా.. మహిళలకు సైతం ఫ్రీగా బస్ జర్నీ చేసే అవకాశం ఇచ్చింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏళ్లు పైబడిన మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా 60 ఏళ్లు పైబడిన మహిళలందరూ వారి ఐడీ కార్డులతో ప్రయాణం చేయాలని సూచించింది. దీంతో సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల పాటు ఉచితంగా భారీ వాహనాలకు సంబంధించి డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. దీంతో పాటు ఈనెల 31వ తేదీ వరకూ ఆర్టీసీ బస్ డిపోల్లో మహిళలు ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం రెండేసి సీట్లు కేటాయిస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed