- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నలుగురి పేర్లతో మహిళ సూసైడ్ నోట్.. కూతురు జీవితం నాలా కాకూడదని..
దిశ, తిరుమలాయపాలెం : నా ప్రాణం కంటే నా ఇద్దరు పిల్లల భవిష్యత్తే ముఖ్యం. తన చావుతోనైనా పిల్లలకు న్యాయం చేయండి. అంటూ సూసైడ్ నోట్ రాసి సుజాత అనే మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. వారసత్వంగా, హక్కుగా రావాల్సిన ఆస్తిని తన పిల్లలకు కాకుండా చేస్తున్నారని, పోలీసులను, పెద్దమనుషులను ఆశ్రయించినా ఫలితం లేకపోగా మనస్థాపానికి గురైన ఆళ్ల సుజాత అనే మహిళ న్యాయం చేయాలంటూ గతంలో తన ఇద్దరు పిల్లలతో తిరుమలాయపాలెం గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపాన నూతన వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా, విషయం తెలుసుకున్న మండల అధికారులు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంకు పై నుంచి దిగి వచ్చింది. అనంతరం ఎంపీడీవో జయరాం తన కార్యాలయంలో ఎమ్మార్వో పుల్లయ్య, ఎస్ఐ గిరిధర్ రెడ్డి, గ్రామ పెద్దలతో కలిసి సుజాత మామ అయిన ఆళ్ల నాగయ్యతో మాట్లాడి వారసత్వంలో భాగంగా వారికి చెందవలసిన ఆస్తిని వారికి ఇవ్వాలని సూచించిన సంగతి విధితమే.
తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన ఆళ్ల నాగయ్య పిచ్చమ్మలకు, శ్రీను,రవి ఇద్దరు కొడుకులు. కాగా పెద్ద కొడుకు శ్రీను ఇటీవల కాలంలో మరణించాడు. చిన్న కొడుకు రవికి కూసుమంచికి చెందిన సుజాతతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వారికి పాప, బాబులు. వారి దాంపత్య జీవితంలో బలమైన కారణాలతో మనస్పర్థాలు రాగా రవి, సుజాత కలిసి ఉండలేమంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్తి పంపకాల విషయమై వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అధికారులు హామీతో కూడా న్యాయం జరగలేదని మనస్తాపం చెంది..
ఈ తగాదాలతో సుజాత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ నెల 14న నీటి ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చెయ్యబోగా, అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు నచ్చజెపి న్యాయం చేస్తామని హామీయిచ్చారు. అనంతరం అధికారులు ఎంపీడీవో జయరాం, తహశీల్దార్ పుల్లయ్య, ఎస్ఐ గిరిధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కొండబాల వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు కలిసి మాట్లాడారు. వాయిదాలు వేయకుండా సుజాతకు చెందవలిసిన ఆస్తి వారికి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చి.. అవిధంగానే అక్కడ సమావేశమైన గ్రామ పెద్దలు, నాయకులు ఒప్పందం చేశారు. అయిన సుజాతకు నేటికీ న్యాయం జరగలేదని, మనస్థాపానికి లోనైన సోమవారం ఖమ్మంలో నా చావుకు కారణం ఆ నలుగురె అని వారి పేర్లు సూసైడ్ నోట్లో రాసి పురుగుమందు తాగి మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేస్కోగా గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం పట్నంలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
తన జీవితంలాగా కూతురు జీవితం కాకూడదు..
తాను పొద్దస్తమానం కష్టపడి కుట్టు మిషిన్ కుట్టగా వచ్చిన డబ్బులతో పిల్లలను పోషించడం భారమైందిని, తండ్రి మరణంతో కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సూసైడ్ నోట్లో పేర్కొంది. తమకు చెందవలసిన ఆస్తి, తన కూతురికి భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుందనుకుంటే.. అది దక్కనివ్వడంలేదని రాసింది. తాను చనిపోతే అప్పుడైన తన పిల్లలకు చెందవలిసిన ఆస్తి ఇస్తారని, తన జీవితంలాగా కూతురు జీవితం కాకూడదని అధికారులను వేడుకుంటూ సూసైడ్ నోట్లో పేర్కొని ఆత్మహత్యాయత్నం చేసింది.