విమానంతో యువతి రిలేషన్‌షిప్‌.. బెస్ట్ పార్ట్‌నర్‌గా కితాబు

by Javid Pasha |
విమానంతో యువతి రిలేషన్‌షిప్‌.. బెస్ట్ పార్ట్‌నర్‌గా కితాబు
X

దిశ, ఫీచర్స్ : టెక్నాలజీ ప్రపంచం మనుషులకు అవసరానికి మించిన లగ్జరీస్‌ అలవాటు చేస్తోంది. అదే సమయంలో మానవ సంబంధాలను దూరం చేస్తోంది. ఇక ప్రతీ పనికి యంత్రాలపై ఆధారపడుతున్న హ్యూమన్ బీయింగ్స్.. ఆత్మీయతను కూడా అందులోనే వెతుక్కుంటున్నారు. కాలక్రమేణా ఒంటరితనానికే మొగ్గుచూపుతూ ప్రాణం లేని బొమ్మలు, వస్తువులపై ప్రేమ పెంచుకుంటున్నారు. ఇదే క్రమంలో ఓ హంగేరియన్ మహిళ 'టాయ్ ప్లెయిన్(బొమ్మ విమానం)'తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తోంది. ఈ ప్లెయిన్‌ను 'లుఫాన్స్'గా పిలుచుకుంటున్న సాండ్రా(28).. తన ఎక్స్ పార్ట్‌నర్స్ అందరిలో ఇదే బెస్ట్ సోల్‌మేట్‌గా నిలిచిందంటూ ప్రశంసిస్తోంది.

బుడాపెస్ట్‌కు చెందిన సాండ్రా.. ఈ బొమ్మ విమానాన్ని జనవరిలో రూ. 60,600కు కొనుగోలు చేసింది. ఇది పక్కన లేకుండా నిద్ర కూడా పోనని.. డైలీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పి ముద్దుపెట్టుకోకుంటే ఆ రోజు అసంపూర్తిగా ఉంటుందని చెబుతోంది. అయితే ఈ టాయ్‌ను ఎందుకు అంతగా ప్రేమిస్తుందో తెలియదంటూనే.. తనను ఆత్మీయ సహచరుడిగా పేర్కొంది. ఇదిలా ఉంటే.. సాండ్రాకు విమానాలపై మోజు మూడేళ్ల వయసు నుంచే మొదలైంది. పెరిగే క్రమంలో విమానాలతో పనిచేయాలని కలలుగన్న ఆమె.. గతేడాది ఏవియేషన్ ఇండస్ట్రీలో జాబ్ కూడా సంపాదించింది.

ఇక విమానాల పట్ల తన ప్రేమ కారణంగా తన ఎక్స్ పార్ట్‌నర్స్ ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోలేదని పేర్కొంది. కానీ గతేడాది మాజీ ప్రియుడితో విడిపోయిన తర్వాత మొదటిసారి ఒక వస్తువుతో రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు తనకు ఈ టాయ్ ప్లెయిన్ ఇస్తున్న ఆనందాన్ని గతంలో ఏ భాగస్వామి ఇవ్వలేదని వెల్లడించింది. ఈ మేరకు పార్ట్‌నర్స్‌గా మనుషుల కంటే విమానాలే నమ్మదగినవని చెప్తున్న సాండ్రా.. వాటితో తాను మౌనంగానే మాట్లాడగలనని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story