- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈత నేర్చుకోవాలంటూ సందేశం.. చేతులు కట్టుకుని నదిని దాటిన 70ఏళ్ల మహిళ!
దిశ, ఫీచర్స్ : ఈతకు వెళ్లి నీట మునిగి అసువులు బాస్తున్న చిన్నారులెంతోమంది. అందుకే ప్రమాదవశాత్తూ నీటిలో పడినా, ప్రమాదం జరిగినా మనల్ని మనం కాపాడుకోవాలంటే 'స్మిమ్మింగ్' తప్పనిసరి. ఈ మేరకు అన్ని వయసుల వారిని ఈత నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు, కేరళలోని వలస్సేరి రివర్ స్విమ్మింగ్ క్లబ్ ఆదివారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా 70 ఏళ్ల వృద్ధురాలు పెరియార్ స్ట్రెచ్‌ను చేతులు కట్టుకుని ఈదడం విశేషం.
కేరళలో పడవ ప్రమాదాలు తరుచుగా జరుగుతాయి. 2009లో తెక్కడిలో జరిగిన పడవ విషాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ విషాద సంఘటనతో కలత చెందిన సాజి వలస్సేరి ఆ మరుసటి ఏడాది వలస్సేరి రివర్ స్విమ్మింగ్ క్లబ్‌ను ప్రారంభించాడు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఉచితంగా స్విమ్మింగ్‌లో శిక్షణ ఇచ్చే సాజి, ఇప్పటివరకు ఆరువేల మందికి పైగా నేర్పించాడు. వీరిలో 700మంది వికలాంగులు, సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో, 720 మంది చిన్నారులు ఈత నేర్చుకున్నారు. వారిలో 130 మంది 30 అడుగుల లోతు 600 మీటర్ల వెడల్పు ఉన్న పెరియార్ నదిని దాటడం విశేషం.
మరో సంఘటన:
పెరియార్ స్ట్రెచ్‌లో గతేడాది ప్రమాదవశాత్తూ ఓ పడవ బోల్తాపడి 77 మంది చనిపోయారు. ఇందులో 62 మంది పురుషులు కాగా, 15 మంది మహిళలు ఉన్నారు. ఇలాంటి నీటి ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ స్విమ్మింగ్ నేర్చుకోమ్మని సాజి ఎంతగా చెబుతున్నా మళ్లీ ఇలాంటి ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలస్సేరి రివర్ స్విమ్మింగ్ క్లబ్ అన్ని వయసుల వారిని ఈత నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు 70 ఏళ్ల ఆరిఫా వీకే చేతులు కట్టుకుని పెరియర్ నదిని ఈదింది. ఆమెతో పాటు 11ఏళ్ల భరత్ కృష్ణ, అశోకపురానికి చెందిన 38ఏళ్ల ధన్య కూడా ఈ ఫీట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఈ ముగ్గురు స్విమ్మర్‌లకు గత వారం రోజులుగా సాజీ, అతని బృందం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రయత్నించే ముందు సరైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ముగ్గురి భద్రతను నిర్ధారించడానికి, నిపుణులైన ఈతగాళ్ల బృందం వారిని పడవలపై అనుసరించింది. వాళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభించి, 8.45 గంటలకు స్ట్రెచ్‌ను విజయవంతంగా దాటారు.
వలస్సేరి అకాడమీలో శిక్షణ పొందిన నా పిల్లలను చూసి స్విమ్మింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మా కుటుంబంలో తొమ్మిది మందికి ఈత వచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో పెరియర్‌ను దాటాను. మా గురువు సాజి వలస్సేరి ప్రోద్బలంతోనే ప్రయత్నించి విజయం సాధించాను. అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలనే సందేశం ఇవ్వడంతో పాటు ఈత నేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించాం. ప్రమాద ఘటనల్లో ఎక్కువగా పిల్లలు ఉంటున్నందునా తల్లిదండ్రులు ఈ సందేశాన్ని గ్రహించాలి.
- ఆరిఫా వీకే