- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఆర్పీఎఫ్ బంకర్‌పై బాంబు విసిరిన మహిళ
by Harish |
X
శ్రీనగర్: కశ్మీర్‌లో ఓ మహిళ చేసిన పని కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి బరాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో బుర్ఖా ధరించి ఉన్న మహిళ సీఆర్పీఎఫ్ బంకర్ పై బాంబు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వెంటనే బాంబు పేలడంతో మంటలు చెలరేగాయని చెప్పారు. అయితే ఎవ్వరికీ గాయాలు కాలేదని అన్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా బాంబు విసిరిన అమ్మాయిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మహిళ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. శ్రీనగర్‌లోని రైనవరీలో బుధవారం ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ వ్యక్తి మీడియా ఐడీ కార్డు కలిగి ఉన్నట్లు చెప్పారు. గతంలో ఓ న్యూస్ పోర్టల్‌లో పని చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ పలు ఉగ్ర దాడుల్లో సహకారం అందించినట్లు వెల్లడించారు.
Advertisement
Next Story