ఛీ.. నువ్వో పనికిమాలినోడివి.. నీతో ఈ పని చేయడం కంటే చనిపోవడం మేలు

by S Gopi |   ( Updated:2022-03-23 07:39:16.0  )
ఛీ.. నువ్వో పనికిమాలినోడివి.. నీతో ఈ పని చేయడం కంటే చనిపోవడం మేలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇష్టపడి అతడిని పెళ్లి చేసుకుంది. 9 నెలలు అతడితో కలిసి కాపురం చేసింది. అయితే, ఆ మహిళ సడెన్ గా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. తన ఆత్మహత్యకు కారణాలేమిటో అందులో పేర్కొంది. విషయం తెలిసి అందరూ షాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెంగళూరులో యశ్వంతాపూర్ లో భార్యాభర్తలు నివాసముంటున్నారు. అయితే వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే, అతను ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ, రానురాను అతడి ప్రవర్తనలో మార్పొచ్చింది. ఆమెను ప్రేమగా చూసుకోవడం మానేసి రోజూ వేధించేవాడు. 'రోజూ ఎవరితో మాట్లాడుతున్నావ్.. ఎంతమందితో సంబంధం ఉంది' అంటూ వేధించేవాడు. తన భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందని ఆశించింది. అయినా కూడా అతను మారకపోవడంతో ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఆమె ఓ లేఖ రాసింది. తన ఆత్మహత్యకు గల కారణాలేమిటో అందులో పేర్కొన్నది. 'నువ్వు చాలామంచోడివని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ, నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ అసలు రూపం బయటపడింది. నువ్వొక శాడిస్టువి. నువ్వో పనికిమాలినోడివి. నీతో కలిసి జీవించడం కంటే చనిపోవడమే మేలు' అని అందులో పేర్కొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆంటీ కోసం కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. నాదంటే నాదీ అంటూ..

Advertisement

Next Story