ఎల్ఎన్‌జీ స్టేషన్ల ఏర్పాటు కార్యరూపం ఎప్పుడు?.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి

by Vinod kumar |   ( Updated:2022-03-28 11:05:34.0  )
vijaya sai reddy
X

దిశ, ఏపీ బ్యూరో: దేశ వ్యాప్తంగా పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగల అవకాశం కలిగిన వేయి లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ స్టేషన్లు ఏర్పాటు ప్రతిపాదన వాస్తవమేనా? అలా అయితే ఎల్‌ఎన్‌జీ స్టేషన్ల ఏర్పాటు చేసే స్థలాలను ప్రభుత్వం గుర్తించిందా? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా రోడ్‌ మ్యాప్‌ను సిద్దం చేసిందా? అని సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ను ప్రశ్నించారు.


దీనికి మంత్రి జవాబిస్తూ.. దేశంలో ప్రధానంగా అన్ని జాతీయ రహదారులపై వేయి ఎల్‌ఎన్‌జీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన చేసిన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే దీనిపై ఇంకా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం కాలేదని అన్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా 50 ప్రదేశాలలో ఎల్‌ఎన్‌జీ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed