Chor Bazaar: 'చోర్ బజార్' మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

by Manoj |   ( Updated:2022-06-20 07:51:39.0  )
Chor Bazaar Will Be Released On June 24
X

దిశ, వెబ్‌డెస్క్: Chor Bazaar Will Be Released On June 24| పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'చోర్ బజార్'.గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ పాటలు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర బృందం.ఈ క్రమంలో తాజాగా, చోర్ బజార్ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానునట్టు చిత్ర యూనిట్ ఓ ఫొటోను షేర్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed