అర్ధ బద్ధ పద్మోత్తనాసనం వల్ల ఉపయోగాలేంటి?

by Manoj |   ( Updated:2023-10-10 16:53:49.0  )
అర్ధ బద్ధ పద్మోత్తనాసనం వల్ల ఉపయోగాలేంటి?
X

దిశ, ఫీచర్స్: మొదటగా బల్ల పరుపు నేలపై నిలబడి పొట్ట నిండా శ్వాస తీస్తూ వదలాలి. తర్వాత కుడి కాలిని గాలిలోకి లేపి శరీర బ్యాలెన్స్ మొత్తం ఎడమకాలిపై మోపాలి. ఇప్పుడు కుడి కాలి పాదాన్ని ఎడమ కాలి తొడపై పొట్టకు దగ్గరగా పెట్టాలి. వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత నెమ్మదిగా బాడీని ముందుకు నేలవైపు వాల్చాలి. అలా పూర్తిగా కిందకు వంచిన తర్వాత కుడి చేతిని వీపుపై నుంచి తీసుకెళ్లి, కుడికాలి బొటన వేలిని పట్టుకోవాలి. ఈ భంగిమలో తల ఎడమ మోకాలిపై ఉండాలి. ఎడమ చేతి అరచేయి నేలపై బలంగా ఆన్చి శరీర బ్యాలెన్స్ కదలకుండా చూసుకోవాలి. ఇలా కాసేపు ఆగి మళ్లీ కుడి కాలిని నేలపై పెట్టి చేయాలి.

ప్రయోజనాలు:

* ఛాతి, భుజాలకు మంచి వ్యాయమం.

* ఆర్మ్ స్ట్రింగ్స్‌ను మరింత సాగదీస్తుంది.

* వెన్నెముక, కాళ్లను బలపరుస్తుంది.

* జీర్ణవ్యవస్థలను సక్రియం చేస్తుంది.

Advertisement

Next Story