ఎంత మంచి మనసు.. నిజంగా ఈ డాక్టర్ దేవుడే..!!

by Nagaya |
ఎంత మంచి మనసు.. నిజంగా ఈ డాక్టర్ దేవుడే..!!
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ అంటేనే దేవుడితో సమానం అంటారు పెద్దలు. ఆ మాటలను నిజం చేశాడు ఓ డాక్టర్. కరోనా లాక్‌డౌన్ సమయంలో మొరదాబాద్ పరిధిలోని 50 గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా అన్ని రకాల వసతులు అందించారు. ఉచిత విద్యను కూడా అందించారు. ఇక ఇప్పుడు తన యావదాస్తినే ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఆయనే ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన డాక్టర్ అర్వింద్ గోయల్. గత 50 సంవత్సరాలుగా ప్రజలకు సేవా చేస్తున్నారు. పేద ప్రజలకు తన వైద్యాన్ని ఉచితంగా అందించారు. తన వైద్యం ద్వారా పేరు, ఆస్తి బాగానే సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు తన వయస్సు మీద పడటంతో సుమారు రూ.600 కోట్ల విలువ చేసే తన ఆస్తినంతటిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాసిచ్చాడు. కాగా.. ఈ నిర్ణయం 25 ఏళ్ల కిందటే తీసుకున్నానని డాక్టర్ గోయల్ తెలిపారు. ఆయన చేసిన సేవలకు గాను నాలుగురు రాష్ట్రపతుల చేతుల మీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు గోయల్.




Advertisement

Next Story

Most Viewed