- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ కారణంగా ఎనిమిది రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడానికి చర్యలకు దిగింది. దీనిలో భాగంగా ఏడు జిల్లాల్లో తాత్కలికంగా ఎనిమిది రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, కూచ్‌బెహార్, జల్‌పైగురి, బీర్భూమ్, డార్జిలింగ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
సోమవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 'ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కొన్ని ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఇంటర్నెట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ సేవలపై నిబంధనలు విధిస్తున్నాం' అని పేర్కొన్నారు. అయితే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, న్యూస్ పేపర్లపైన ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. చట్టవిరుద్ధమైన చర్యలను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.